
తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి ఎండ తీవ్రత అధికమవుతుంది.గడిచిన గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ,ఈ ఏడు ఎండ తీవ్రత అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఉదయం ఏడు గంటల నుండే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం పది గంటల తర్వాత బయటకు రావడానికి జనం జంకుతున్నారు.ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప బయట తిరగడం మంచిది కాదు అని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పని మీద బయటకు వచ్చే ప్రజలు తమవెంట త్రాగునీటి ని తప్పనిసరిగా తెచ్చుకోవాలి.ఎక్కువసేపు ఎండలో తిరగరాదు. అలసటగా అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.గ్రామాలలో రోజు వారి కూలి పనులకు వెళ్ళే ప్రజలు ఎండ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.చల్లటి నీరు,మజ్జిగ,లస్సీ లాంటి పానీయాలు తాగాలి.పుచ్చకాయ,తర్బుజా లాంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్ల ను విధిగా తినాలి.ఈ వేసవి కాలం లో ఎండ వేడి నుండి శరీరాన్ని రక్షించే క్రమం లో మసాలా,కారం అధికంగా వాడే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

