Postbox News

2026-10-06
Offcanvas

Posts Express

Edit Template

వర్గీకరించనివి

“థియేటర్‌లో బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో మిక్స్‌డ్ టాక్! ‘ఇరుముడి’కి ఎందుకీ తేడా?”

ఇరుముడి ఓటీటీలో మిక్స్‌డ్ టాక్‌కు అసలు కారణం ఇదే!‘ఇరుముడి’ నిన్న ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ముందస్తు అగ్రిమెంట్ కారణంగా కేవలం 28 రోజుల విండోతోనే డిజిటల్ రిలీజ్ చేశారు. ఇక ఈ శుక్రవారం నాని ‘ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో.. బాక్సాఫీస్ దగ్గర రవితేజ దూకుడుకు నాని బ్రేక్ వేయడానికి సిద్ధమైనట్టే కనిపిస్తోంది.అయితే ‘ఇరుముడి’ని స్మార్ట్ టీవీలు, మొబైల్స్‌లో చూసిన ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో కాస్త భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో చూసినప్పుడు ఒకలా.. ఓటీటీలో చూసినప్పుడు మరోలా అనిపించడానికి కారణమేంటి? అసలు ఈ మిక్స్‌డ్ రియాక్షన్ ఎందుకు వస్తోంది?థియేటర్ అనుభూతిని ఓటీటీ ఇవ్వగలదా?ఎప్పటికైనా థియేటర్‌లో సినిమా చూడటం ఇచ్చే అనుభూతికి టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ పూర్తిగా సాటి రాలేవు. ‘ఇరుముడి’ విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.ఉదాహరణకు ‘ముత్యాల పల్లకి’ పాట వచ్చినప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు మొత్తం వైబ్ అయిపోయారు. స్క్రీన్ ముందు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసిన ఆ ఎనర్జీని.. అదే పాటను ఇంట్లో ఒంటరిగా చూస్తే పూర్తిగా ఫీల్ అవ్వడం కష్టం. డాల్బీ సౌండ్, పెద్ద స్క్రీన్, చుట్టూ వందలాది మంది ప్రేక్షకుల రెస్పాన్స్.. ఇవన్నీ కలిసి సన్నివేశాల ఇంపాక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయి.ఆటో చేజింగ్ సన్నివేశాలు, అసలు హంతకుడు ఎవరనే రివీల్, క్లైమాక్స్‌లో మెయిన్ విలన్లను రవితేజ శిక్షించే ఎపిసోడ్.. ఇవన్నీ థియేటర్‌లో చూసినప్పుడు కలిగే ఎఫెక్ట్ వేరు. ఇంట్లో చూసేటప్పుడు మాత్రం ప్రేక్షకుడి దృష్టి కథ, లాజిక్, స్క్రీన్‌ప్లేపై ఎక్కువగా వెళ్తుంది.లోపాలు లేవా అంటే.. ఉన్నాయి!‘ఇరుముడి’ ఏ ‘మాయాబజార్’, ‘షోలే’ లాంటి పరిపూర్ణ క్లాసిక్ కాదు. దర్శకుడు శివ నిర్వాణ చేసిన కొన్ని పొరపాట్లు, లాజిక్‌కు దూరంగా అనిపించే అంశాలు సినిమాలో ఉన్నాయి. కొన్ని చోట్ల కథను మరింత బలంగా రాసుకునే అవకాశం కూడా ఉంది.కానీ థియేటర్‌లో తెరపై జరిగే మేజిక్, రవితేజ పెర్ఫార్మెన్స్, ఎలివేషన్స్, పాటలు, యాక్షన్ సీన్లు, క్లైమాక్స్.. ఇవన్నీ కలిసి ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయి. దీంతో సినిమా చూస్తున్న సమయంలో చాలామంది ఈ లోపాలను పెద్దగా పట్టించుకోలేదు.అసలు గేమ్ మార్చింది మౌత్ టాక్!‘ఇరుముడి’ విషయంలో మరో కీలక అంశం మౌత్ టాక్. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు సినిమాను పాజిటివ్‌గా మాట్లాడటం మొదలుపెట్టడంతో ఆ టాక్ క్రమంగా సినిమాకు బలంగా మారింది.ఒకరు సినిమా గురించి చెప్పడం.. ఇంకొకరు థియేటర్‌లో చూసి అదే అనుభూతిని పొందడం.. ఇలా మౌత్ టాక్ పెరగడంతో ‘ఇరుముడి’ రీచ్ మరింత విస్తరించింది.ఇదేమీ కొత్త పరిణామం కాదు!థియేటర్లలో సూపర్‌హిట్ లేదా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమాలకు ఓటీటీలో మిక్స్‌డ్ రియాక్షన్స్ రావడం కొత్తేమీ కాదు. ‘ఉప్పెన’, ‘మిరాయి’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలు కూడా థియేటర్లలో భారీ స్పందన అందుకున్న తర్వాత డిజిటల్‌లో భిన్నమైన చర్చను ఎదుర్కొన్నాయి.దానికి ప్రధాన కారణం.. థియేటర్‌లో సినిమా చూసే అనుభవం, ఇంట్లో సినిమా చూసే అనుభవం ఒకటి కాకపోవడమే.థియేటర్‌లో ఎలివేషన్స్, ఆడియన్స్ రెస్పాన్స్, సౌండ్, బిగ్ స్క్రీన్, సామూహిక అనుభూతి.. ఇవన్నీ సినిమాకు అదనపు ఇంపాక్ట్ ఇస్తాయి. ఓటీటీలో మాత్రం ప్రేక్షకుడికి కథ, లాజిక్, స్క్రీన్‌ప్లే వంటి అంశాలను నిశితంగా పరిశీలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.‘ఇరుముడి’కి ఇప్పుడు కొత్త సర్టిఫికెట్ అవసరమా?ఇప్పుడు ఓటీటీలో ‘ఇరుముడి’ని చూసి “బాగుంది”, “బాలేదు” అంటూ కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల సినిమాకు పెద్దగా వచ్చే లాభనష్టాలేమీ లేవు.ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో తన ప్రభావాన్ని చూపించింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి, రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.అందుకే ఓటీటీలో వస్తున్న మిక్స్‌డ్ రియాక్షన్స్‌ను సినిమాకు వచ్చిన తుది తీర్పుగా చూడాల్సిన అవసరం లేదు.థియేటర్‌లో ‘ఇరుముడి’ ఒక అనుభూతి.. ఓటీటీలో ‘ఇరుముడి’ ఒక విశ్లేషణ.ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న భిన్నమైన అభిప్రాయాలకు అసలు కారణం!

“థియేటర్‌లో బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో మిక్స్‌డ్ టాక్! ‘ఇరుముడి’కి ఎందుకీ తేడా?” Read More »

ఉత్తరాదిలో నెమ్మదిగా మొదలైన ‘పెద్ది’ పరుగు.. లాంగ్ రన్‌పై ఆశలు..?

తెలుగు రాష్ట్రాల్లో పెద్ది వసూళ్ల పరంగా బలంగా ఉంది. చాలా బాగుంది నుంచి యావరేజ్ దాకా టాక్ ఎలా ఉన్నప్పటికీ రామ్ చరణ్ స్టార్ పవర్ తో పాటు అతను ఈ సినిమా కోసం పడిన కష్టం జనాన్ని థియేటర్లకు తీసుకొస్తున్న మాట వాస్తవం. ముఖ్యంగా ఆంధ్ర బెల్ట్ లో పెద్ది వసూళ్లు భారీగా ఉన్నాయి. టికెట్ రేట్ల పెంపు ప్రభావం నైజామ్ లో కనిపిస్తోంది. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఒక సింగల్ స్క్రీన్ ఒక టికెట్ 420 రూపాయల ధర పెట్టడాన్ని అభిమానులే సమర్ధించలేకపోతున్నారు.దీని సంగతలా ఉంచితే పెద్ది పరుగు ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం నెమ్మదిగా ఉంది. భోపాల్ లో అంత పెద్ద ఈవెంట్, ముంబై ఢిల్లీలో ప్రెస్ మీట్లు గట్రా పెట్టి, ప్రమోషన్స్ పరంగా ప్రచారంలో టీమ్ ఎలాంటి లోపం లేకుండా చూసుకుంది. అయితే బాలీవుడ్ జనాలు పుష్ప 2, కెజిఎఫ్ 2 లాగా మొదటిరోజే చూసేయాలన్న స్థాయిలో ఎగబడలేదు. కారణం జానర్. పెద్ది దేనికీ సీక్వెల్ కాదు. కెజిఎఫ్ లాగా ఎలివేషన్లు, కాంతర లాగ డివోషన్లు లేవు. ఒక నిజాయితీ ఆటగాడి కథను చెప్పారు.దాని వల్ల టాక్ కోసం ఎదురు చూసిన హిందీ ఆడియన్స్ మెల్లగా థియేటర్లకు టర్న్ అవుతున్నారు. ఇప్పటిదాకా అయిదు కోట్ల నెట్ వసూళ్లు దాటినట్టు ట్రేడ్ టాక్. పోటీలో ఉన్న వరుణ్ ధావన్ ‘హై జవానీతో ఇష్క్ హోనాహై’కు డిజాస్టర్ టాక్ రావడం, బాబి డియోల్ ‘బందర్’ అన్ని వర్గాలను మెప్పించేలా లేకపోవడం పెద్దికి వరంగా మారొచ్చు. మరీ రికార్డులు షేక్ అయ్యే స్థాయిలో కాదు కానీ ఆక్యుపెన్సీలు డీసెంట్ గా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం.

ఉత్తరాదిలో నెమ్మదిగా మొదలైన ‘పెద్ది’ పరుగు.. లాంగ్ రన్‌పై ఆశలు..? Read More »

భగ భగ మండుతున్న భానుడు,బెంబేలెత్తుతున్న ప్రజలు

తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి ఎండ తీవ్రత అధికమవుతుంది.గడిచిన గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ,ఈ ఏడు ఎండ తీవ్రత అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఉదయం ఏడు గంటల నుండే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం పది గంటల తర్వాత బయటకు రావడానికి జనం జంకుతున్నారు.ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప బయట తిరగడం మంచిది కాదు అని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పని మీద బయటకు వచ్చే ప్రజలు తమవెంట త్రాగునీటి ని తప్పనిసరిగా తెచ్చుకోవాలి.ఎక్కువసేపు ఎండలో తిరగరాదు. అలసటగా అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.గ్రామాలలో రోజు వారి కూలి పనులకు వెళ్ళే ప్రజలు ఎండ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.చల్లటి నీరు,మజ్జిగ,లస్సీ లాంటి పానీయాలు తాగాలి.పుచ్చకాయ,తర్బుజా లాంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్ల ను విధిగా తినాలి.ఈ వేసవి కాలం లో ఎండ వేడి నుండి శరీరాన్ని రక్షించే క్రమం లో మసాలా,కారం అధికంగా వాడే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భగ భగ మండుతున్న భానుడు,బెంబేలెత్తుతున్న ప్రజలు Read More »

download (1)

స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో హైదరాబాద్‌లో టెక్ పెట్టుబడులు భారీగా పెరిగాయి

ఈ త్రైమాసికంలో పలు దేశీయ, అంతర్జాతీయ స్టార్టప్‌లు తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించడంతో, హైదరాబాద్ ఒక ప్రముఖ టెక్నాలజీ హబ్‌గా తన ఖ్యాతిని మరింత పటిష్టం చేసుకుంటోంది. తెలంగాణ యొక్క పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు ప్రధాన ఆకర్షణలని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. నగరంలోని ఐటీ కారిడార్‌లో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్ మరియు హెల్త్-టెక్ కంపెనీల నుండి ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వ మద్దతు ఉన్న ఇన్నోవేషన్ హబ్‌లు, ప్రారంభ దశ స్టార్టప్‌లకు నిధులు మరియు మార్గదర్శకత్వ అవకాశాలను పొందడంలో సహాయపడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా మారగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానిక విశ్వవిద్యాలయాలు కూడా విద్యా పరిశోధనను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చడానికి కంపెనీలతో కలిసి పనిచేస్తూ, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడంలో సహాయపడుతున్నాయి. సాంకేతిక రంగ వృద్ధి రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, పట్టణ అభివృద్ధి మరియు విదేశీ పెట్టుబడుల పెరుగుదలకు దోహదపడుతోందని ఆర్థిక పరిశీలకులు పేర్కొంటున్నారు.

స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో హైదరాబాద్‌లో టెక్ పెట్టుబడులు భారీగా పెరిగాయి Read More »

upcoming telugu movies ott release dates 2026

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో గుర్తింపు పొందుతున్న తెలుగు సినిమా

తెలుగు సినిమా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. అనేక తెలుగు చిత్రాలు అంతర్జాతీయంగా విడుదలవుతూ సానుకూల స్పందనలను అందుకుంటున్నాయి. ఇటీవలి చిత్రాల విజయం ప్రపంచవ్యాప్తంగా తెలుగు నటీనటులు, దర్శకుల ప్రజాదరణను పెంచింది. అంతర్జాతీయ ప్రేక్షకులు తెలుగు కథనం మరియు చిత్ర నిర్మాణం పట్ల గొప్ప ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఎదుగుదల తెలుగు చిత్ర పరిశ్రమను కొత్త శిఖరాలకు చేర్చడంలో సహాయపడుతోంది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో గుర్తింపు పొందుతున్న తెలుగు సినిమా Read More »

download (2)

2026లో భారీ సందడి సృష్టిస్తున్న రాబోయే తెలుగు సినిమాలు

పలు భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో, తెలుగు చిత్ర పరిశ్రమ 2026 సంవత్సరానికి సిద్ధమవుతోంది. అగ్ర నటీనటులు, దర్శకులు యాక్షన్, డ్రామా, వినోదాన్ని అందించే ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. బహుళ భాషల్లో విడుదల కానున్న పాన్-ఇండియా చిత్రాలపై అభిమానులు ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉన్నారు. ఉన్నత నిర్మాణ విలువలు, అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, బలమైన కథాంశాలతో రూపొందిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేస్తాయని అంచనా. 2026 సంవత్సరం తెలుగు సినిమాకు విజయవంతమైన సంవత్సరంగా నిలుస్తుందని చిత్ర పరిశ్రమ ఆశిస్తోంది.

2026లో భారీ సందడి సృష్టిస్తున్న రాబోయే తెలుగు సినిమాలు Read More »

Scroll to Top