Postbox News

2026-09-10
Offcanvas

Posts Express

Edit Template

‘ఇరుముడి’ మూవీ సమీక్ష : రవితేజకు మంచి కంబ్యాక్.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకున్న మాస్ మహారాజ్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. డివోషనల్ టచ్‌తో పాటు తండ్రి–కూతురు అనుబంధం, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను మిళితం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం. కథ విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతానికి సమీపంలోని పొల్లూరు గ్రామంలో త్రినాథ్ రామ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియ భవానీ శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)తో కలిసి జీవిస్తుంటాడు. కూతురంటే త్రినాథ్‌కు ఎంతో ప్రేమ. తన చుట్టూ కనిపించే ప్రతి ఆడపిల్లలోనూ తన కూతురిని చూసుకునే వ్యక్తిత్వం అతడిది. మరోవైపు మద్యానికి అలవాటు పడిన త్రినాథ్.. కార్తీక మాసంలో మాత్రం అయ్యప్ప మాల ధరించి 41 రోజుల పాటు కఠినమైన నియమాలను పాటిస్తుంటాడు. ఈ నేపథ్యంలో గ్రామంలోని అమ్మాయిలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఓ ఘటన కథలో కీలకంగా మారతాయి. విద్యార్థులతో కఠినంగా వ్యవహరించిన ఓ టీచర్ కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోవడం, అనంతరం ఆ టీచర్ సస్పెన్షన్‌కు గురికావడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. అయితే ఆమె తిరిగి విధుల్లోకి రావడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారతాయి. అసలు త్రినాథ్ జీవితంలోకి వచ్చిన సమస్య ఏమిటి? అతడు అయ్యప్ప మాల ఎందుకు ధరించాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెరపై చూడాలి. ఎలా ఉందంటే.. శివ నిర్వాణ ఎంచుకున్న కథాంశం ఆసక్తికరంగా ఉంది. ఫస్టాఫ్‌లో కథను ఎక్కువగా సాగదీయకుండా త్రినాథ్ జీవితాన్ని, అతని కూతురితో ఉన్న అనుబంధాన్ని దర్శకుడు బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్వెల్ సమయంలో భారీ ట్విస్ట్ లేకపోయినా.. మంచి ఎమోషనల్ సీన్‌తో సినిమాపై ఆసక్తిని కొనసాగించారు. అసలు కథలోని కీలక మలుపులను దర్శకుడు సెకండాఫ్‌లో ఉంచారు. అక్కడ వచ్చే ట్విస్టులు, ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే మలుపు బాగా వర్కవుట్ అయ్యాయి. అయితే ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కొన్ని సందర్భాల్లో కథ కాస్త నెమ్మదించిన అనుభూతి కలుగుతుంది. క్లైమాక్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ.. అక్కడ వచ్చే పాటను మరింత ఎమోషనల్‌గా డిజైన్ చేసి ఉంటే ప్రభావం ఇంకాస్త పెరిగేది. రవితేజ నటన హైలైట్ ‘ఇరుముడి’ సినిమాకు ప్రధాన బలం రవితేజ నటన. తన రెగ్యులర్ మాస్ హీరో ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా త్రినాథ్ రామ అనే సాధారణ తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కూతురిపై ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాల్లో రవితేజ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఇటీవల రవితేజ నటనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌కు ‘ఇరుముడి’ మంచి సమాధానంగా నిలిచే అవకాశం ఉంది. బేబీ నక్షత్ర ప్రత్యేక ఆకర్షణ ప్రియ భవానీ శంకర్ కావేరి పాత్రలో మెప్పించారు. అయితే మణికంఠ పాత్రలో నటించిన బేబీ నక్షత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా సహజంగా నటించిన ఆమె పలు కీలక సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. సాయికుమార్ పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉంది. అజయ్ ఘోష్, స్వాసిక, లక్ష్మణ్ మీసాల, రమేష్ ఇందిర తమ పాత్రలకు న్యాయం చేశారు. రాజ్‌కుమార్ కసిరెడ్డికి మాత్రం పెద్దగా స్కోప్ దక్కలేదు. సాంకేతిక విభాగాలు ఎలా ఉన్నాయంటే.. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు మంచి ప్లస్‌గా నిలిచింది. ముఖ్యంగా అయ్యప్ప స్వామికి సంబంధించిన పాటలు కథలోని భావోద్వేగాన్ని మరింతగా క్యారీ చేశాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. అటవీ ప్రాంతాలను అందంగా, సహజంగా చూపించారు. దర్శకుడు శివ నిర్వాణ కథలోని ఎమోషన్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. చివరగా.. అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు, తండ్రి–కూతురు అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో ‘ఇరుముడి’ ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది. రవితేజ నటన, బేబీ నక్షత్ర పెర్ఫార్మెన్స్, జీవీ ప్రకాశ్ సంగీతం, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలాలు. అయితే రెగ్యులర్ మాస్ కామెడీ, గ్లామర్, రొమాన్స్‌ను ఆశించే రవితేజ అభిమానులకు ఈ సినిమా కొంత భిన్నంగా అనిపించవచ్చు. ఎమోషనల్ కంటెంట్, ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ‘ఇరుముడి’ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌గా.. ‘ఇరుముడి’ రవితేజకు మంచి కంబ్యాక్ మూవీగా నిలిచేలా ఉంది.

‘ఇరుముడి’ మూవీ సమీక్ష : రవితేజకు మంచి కంబ్యాక్.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకున్న మాస్ మహారాజ్ Read More »

కొరియన్ కనకరాజు సినిమా సమీక్ష

వరుస ప్లాపులతో సతమతమవుతూ కొత్తగా కామెడీ కొరియన్ డ్రామా తో మన ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ లో తెలుసుకుందాం… కొరియన్ కనకరాజు పేరు వినడానికి కొత్తగా ఉన్న సినిమాలో మ్యాటర్ కూడా అంతే కొత్తగా ఉంది . అనంతపురంలో పెనుకొండలో నివసించే సామాన్య కనకరాజు కొరియన్ కనకరాజుగా ఎందుకు పిలవబడ్డాడు అసలు అతను కొరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఈ సినిమా మూల కథ. ఈ సినిమా కథ కొరియాలో మొదలవుతుంది. అక్కడ నుంచి కథ బెంగళూరులో టేకాఫ్ అయ్యి పెనుకొండ లో ఉన్న కియా మోటార్స్ ఫ్యాక్టరీ కి చేరుతుంది పెనుగొండలో నివసించే కనకరాజు తన ఫ్రెండు ఫోటో స్టూడియో కి వచ్చిన హీరోయిన్ తో ప్రేమలో పడతాడు . తనకేమో కొరియా వెళ్లి కొరియా వాడిని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడుతుంది అలాంటి కనకరాజు తనని ఎలా బుట్టలో వేశాడు అసలు కొరియా ఎలా వెళ్లాడు కొరియాకి కనకరాజుకి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే కొరియన్ కనకరాజు సినిమా చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్ అదరగొట్టాడు తనకు జోడిగా రితిక నాయక్ చాలా బాగా నటించింది. వీళ్లిద్దరు జోడి కూడా బాగుంది కనకరాజు ఫ్రెండ్ గా సత్య తనదైన శైలిలో కామెడీని పండించాడు. సత్య చేసే కామెడీకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి ఇంకా వీరికి తోడుగా కొరియా నటులు, వీటివి గణేష్, బుల్లి రాజు తమ పరిధి మేరకు నటించారు సాంకేతిక పరంగా చూసుకుంటే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి కథాను సారం సౌత్ కొరియాలో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు ఇక సంగీతం విషయానికి వస్తే తమన్ థియేటర్స్ దద్దరిల్లేలా చేశాడు, తమన్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది.పాటలు కూడా చక్కగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది. ఇక నిర్మాణ విలువల గురించి మాట్లాడుకుంటే యూవి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ విలువలు చాలా బాగా కుదిరాయి. చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్ కి ఒక మంచి హిట్ సినిమా దొరికినట్టే అని భావించవచ్చు. థియేటర్స్ ఆద్యంతం నవ్వుల జడిలో తడిచాయి. ఇక చివరిగా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాకి కెప్టెన్ మరియు రైటర్ మేర్లపాక గాంధీ తనదైన శైలిలో అద్భుతమైన కామెడీని రాబట్టుకోవటంలో సక్సెస్ కాగలిగాడు. గాంధీ మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్, తరువాత వచ్చిన రన్ రాజా రన్ ఎలాంటి అద్భుతమైన నవ్వుల పండించాయో ఈ సినిమా కూడా అదే కోవలో ఆధ్యంతం నవ్వులు పండిస్తుంది. చివరి మాటఈ వారాంతం ఫ్యామిలీ మొత్తం తో కలిసి థియేటర్ కి వెళ్లి మీరు మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమాని, సరదాగా హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటే కొరియన్ కనకరాజుని తప్పకుండా చూడొచ్చు.

కొరియన్ కనకరాజు సినిమా సమీక్ష Read More »

ఇరాన్ – యూఎస్ శాంతి ఒప్పందంతో భారత్‌కు జాక్ పాట్!

గడిచిన మూడు నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం (MoU) పై డిజిటల్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) మార్గాన్ని తిరిగి తెరవడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ ఇరాన్ అమెరికా (iran us) శాంతి ఒప్పందం వల్ల ప్రపంచ దేశాల కంటే కూడా భారతదేశానికే అత్యధిక లాభాలు కలగబోతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.భారతదేశం తన దేశీయ అవసరాల కోసం దాదాపు 85 శాతం ముడిచమురును ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు శాంతి ఒప్పందం వల్ల ఇరాన్ నుండి మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లోకి భారీగా ఆయిల్ సరఫరా పెరగనుంది. దీనివల్ల యుద్ధ భయాలతో పెరిగిన క్రూడాయిల్ ధరలు (War Premium) ఒక్కసారిగా దిగివస్తాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గడం కూడా మొదలైంది. ఇది మన దేశ ఆయిల్ ఇంపోర్ట్ బిల్లును భారీగా తగ్గిస్తుంది. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి తగ్గి, రూపాయి విలువ మరింత బలపడుతుంది.ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ రూట్ అయిన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గుండానే భారత్‌కు అవసరమైన ముడిచమురు, ఎల్‌ఎన్‌జీ (LNG), ఎల్‌పీజీ (LPG) దిగుమతులు జరుగుతాయి. యుద్ధం వల్ల ఈ మార్గం క్లోజ్ అవ్వడంతో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడి, కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఇప్పుడు ఈ రూట్ ఓపెన్ అవ్వడం వల్ల గ్యాస్ కొరత తీరి, రాబోయే రోజుల్లో సిలిండర్ల ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.యుద్ధ వాతావరణం వల్ల సముద్ర మార్గాల్లో రవాణా ఖర్చులు (Shipping Costs) విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు టెన్షన్లు తగ్గడంతో ఇండియన్ ఎగుమతిదారులకు మంచి రోజులొచ్చాయి. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటో కాంపోనెంట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలకు భారీగా లాభాలు ఉంటాయి. దీనికి తోడు, ఇరాన్‌పై ఆంక్షలు సడలిస్తే.. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘చాబహార్ పోర్ట్’ (Chabahar Port) ద్వారా ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలకు పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడల్లా భారత స్టాక్ మార్కెట్లకు భారీగా కలిసివస్తుంది. కంపెనీల ఉత్పత్తి ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగి మార్కెట్లలోకి పెట్టుబడులు వస్తాయి. దేశంలో నిత్యావసరాల ధరలు (Inflation) అదుపులోకి వచ్చి ఆర్థిక వృద్ధి రేటు పరుగులు పెడుతుంది.ఈ పీస్ డీల్ ప్రస్తుతానికి 60 రోజుల గడువు ఉన్న ఒక తాత్కాలిక (Interim) ఒప్పందం మాత్రమే. ఇరాన్ అణు కార్యక్రమం, పూర్తి స్థాయి ఆంక్షల తొలగింపు వంటి కీలకమైన సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. రాబోయే 60 రోజుల్లో జరిగే చర్చలు సఫలమైతేనే ఈ లాభాలన్నీ అందుతాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం మళ్లీ ఆయిల్ ధరలు పెరిగి టెన్షన్లు మొదలయ్యే ప్రమాదం ఉంది. ఏదేమైనా ప్రస్తుతానికైతే ఈ శాంతి ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద బూస్టర్ డోస్ అని చెప్పవచ్చు!

ఇరాన్ – యూఎస్ శాంతి ఒప్పందంతో భారత్‌కు జాక్ పాట్! Read More »

గ్రీన్ కార్డ్ ఆశలు ఆవిరి అమెరికా కఠిన నిర్ణయం

అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) జూలై నెలకు సంబంధించి కొత్త ఫైలింగ్ నిబంధనలను విడుదల చేసింది. వచ్చే నెలలో ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత కేటగిరీల వారు ‘ఫైనల్ యాక్షన్ డేట్స్’ చార్ట్‌ను మాత్రమే అనుసరించాల్సి ఉంటుంది. అయితే, ఫ్యామిలీ స్పాన్సర్డ్ దరఖాస్తుదారులకు మాత్రం ‘డేట్స్ ఫర్ ఫైలింగ్’ చార్ట్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. గ్రీన్ కార్డ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపనుంది. ఎవరు త్వరగా అధికారికంగా రెసిడెన్సీ దరఖాస్తును సమర్పించవచ్చో ఈ నిబంధనలే నిర్ణయిస్తాయి.స్టేట్ డిపార్ట్‌మెంట్ (DOS) ప్రతి నెలా విడుదల చేసే బులెటిన్‌ను ఫాలో అయ్యే వారికి ఇది ఒక కీలక మార్పు. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ (AOS) కోసం ‘ఫైనల్ యాక్షన్ డేట్స్’ తప్పనిసరి చేయడంతో నిబంధనలు కఠినతరమయ్యాయి. దీనివల్ల EB-2, EB-3 కేటగిరీల్లో ఉన్న చాలా మంది భారతీయ టెక్ ఉద్యోగులు ఇప్పుడే దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయారు. వారి ప్రయారిటీ డేట్ (PD) పూర్తిగా కరెంట్ అయ్యే వరకు వారు వేచి చూడక తప్పదు.EB-1 కేటగిరీలోని భారతీయ దరఖాస్తుదారుల విషయంలో పురోగతి నెమ్మదిగానే ఉన్నా, నిలకడగా సాగుతోంది. చాలా మంది నిపుణులు ‘ఫైలింగ్ డేట్స్’ ద్వారా ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) పొందవచ్చని ఆశించారు. కానీ, USCIS జూలై ఫైలింగ్స్‌ను ‘ఫైనల్ యాక్షన్ డేట్స్’కే పరిమితం చేయడంతో ఆ దారి మూసుకుపోయింది. ఈ జాప్యం వల్ల కెరీర్ గ్రోత్ మాత్రమే కాకుండా, విదేశీ ప్రయాణాల విషయంలోనూ భారతీయ వలసదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అభ్యర్థులు వెంటనే తమ ప్రయారిటీ డేట్స్‌ను జూలై ఫైనల్ యాక్షన్ డేట్స్‌తో సరిచూసుకోవడం మంచిది. ఫారమ్ I-485 ఫైల్ చేయడానికి సరైన సమయం చూసుకోవడంతో పాటు, వాలిడ్ మెడికల్ రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ మీ డేట్ కరెంట్ అయితే, ప్రయాణాల కోసం ‘అడ్వాన్స్ పరోల్’ (AP) కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియా లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది చాలా కీలకం.ఫ్యామిలీ స్పాన్సర్డ్ కేటగిరీలకు నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. వీరు ఇంకా ‘డేట్స్ ఫర్ ఫైలింగ్’ చార్ట్‌నే ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎంప్లాయ్‌మెంట్ అభ్యర్థుల కంటే ముందే కుటుంబ సభ్యులు తమ దరఖాస్తులను సమర్పించే వీలుంటుంది. కుటుంబాలు కలిసి ఉండటానికి, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌లో ఉన్నప్పుడే వర్క్ పర్మిట్లు పొందడానికి ఈ చార్ట్ విధానం ఒక గొప్ప అవకాశం.ఒకవేళ మీ డేట్ కరెంట్ అయితే, వచ్చే 48 నుంచి 72 గంటల్లోపు మీ ఇమ్మిగ్రేషన్ లాయర్‌ను సంప్రదించండి. అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోండి. ఒక్కసారి ఈ ఫైలింగ్ విండో చేజారితే, మళ్లీ ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. వీసా డిమాండ్‌ను బట్టి ఈ నిబంధనలు ప్రతి నెలా మారుతుంటాయి, కాబట్టి USCIS అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.

గ్రీన్ కార్డ్ ఆశలు ఆవిరి అమెరికా కఠిన నిర్ణయం Read More »

వరుణుడి వీరంగం.. వర్షపు నీటిలో చిక్కుకున్న హైదరాబాద్

హైదరాబాద్‌ నగరాన్ని ఈ రోజు కురిసిన భారీవర్షం అతలాకుతలం చేసింది. గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ, భారీ వర్షం నగర జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షం సాయంత్రానికి మరింత ఉధృతమై, నగరంలోని పలు ప్రాంతాలను జలమయం చేసింది.ఖైరతాబాద్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడ్డారు. ప్రధాన కూడళ్లు, ఫ్లైఓవర్లు, లోతట్టు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించడంతో నగరమంతా ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి.భారీ వర్షపాతం కారణంగా కాలువలు, డ్రెయిన్లు పొంగిపొర్లి పలు కాలనీల్లోకి నీరు చేరింది. బన్సీలాల్‌పేట్‌లో అత్యధికంగా 87.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, హిమాయత్‌నగర్, విఠల్‌వాడి, విద్యానగర్ ప్రాంతాల్లోనూ గణనీయమైన వర్షం కురిసింది. కొద్ది గంటల వ్యవధిలోనే భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు చిన్నచిన్న చెరువులను తలపించాయి.మరోవైపు బలమైన గాలులతో పాటు కురిసిన వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు, తీగలు దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బండ్లగూడలో నీటిలో పడివున్న విద్యుత్ తీగలను గుర్తించలేక ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది.పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నీటి నిల్వలను తొలగించడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం కోసం అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేశారు.అయితే ఈ వర్షం నగరవాసులకు ఎండల నుంచి ఊరటను కూడా అందించింది. ఉక్కపోత వాతావరణానికి తెరపడగా, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గి చల్లని వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.హైదరాబాద్‌లో ప్రతి భారీ వర్షానికీ పునరావృతమవుతున్న ట్రాఫిక్ సమస్యలు, నీటి నిల్వలు, డ్రైనేజీ ఇబ్బందులు నగర మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారాల దిశగా అధికారులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

వరుణుడి వీరంగం.. వర్షపు నీటిలో చిక్కుకున్న హైదరాబాద్ Read More »

విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.ప్లాంట్‌లో ద్రవ ఉక్కును తరలిస్తున్న సమయంలో దానిని మోసుకెళ్తున్న లాడిల్ (బకెట్)లో రంధ్రం ఏర్పడటంతో వేడెక్కిన ద్రవ ఉక్కు కిందకు జారిపడింది. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులపై అది పడటంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలో ఉన్న మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి H. D. Kumaraswamy విశాఖకు చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం పరిహారం, సహాయ చర్యలపై కీలక ప్రకటన చేశారు.మంగళవారం ఉదయం విశాఖకు చేరుకున్న Pawan Kalyan కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రం ప్రకటించిన సహాయానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించనున్న మద్దతుపై స్పష్టత ఇచ్చారు.ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేయనున్నారు. అలాగే వారి కుటుంబంలోని ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించనున్నారు. మృతుల పిల్లల విద్యాభ్యాసానికి పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకోనుంది. వారు ఎంతవరకు చదివినా ఆ విద్యా ఖర్చులన్నింటినీ భరిస్తామని ప్రకటించింది.ఇక గాయపడిన వారికి పూర్తిగా కోలుకునే వరకు ఉచిత వైద్యం అందించనున్నారు. చికిత్స ఖర్చులతో పాటు ఒక్కో బాధితుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేయనున్నారు. అదనంగా, మృతుల కుటుంబాలకు బీమా (ఇన్సూరెన్స్) ద్వారా లభించే మొత్తాన్ని కూడా చెల్లించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం బీమా మొత్తానికి అదనమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఈ ఘటన నేపథ్యంలో గతంలో విశాఖలో జరిగిన LG Polymers Gas Leak ఘటనను పలువురు గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం అందించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం కూడా పరిహారం పెంచాలని కొందరు డిమాండ్ చేస్తున్నప్పటికీ, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ విషాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, శాశ్వత ఉద్యోగం Read More »

ఉత్తరాదిలో నెమ్మదిగా మొదలైన ‘పెద్ది’ పరుగు.. లాంగ్ రన్‌పై ఆశలు..?

తెలుగు రాష్ట్రాల్లో పెద్ది వసూళ్ల పరంగా బలంగా ఉంది. చాలా బాగుంది నుంచి యావరేజ్ దాకా టాక్ ఎలా ఉన్నప్పటికీ రామ్ చరణ్ స్టార్ పవర్ తో పాటు అతను ఈ సినిమా కోసం పడిన కష్టం జనాన్ని థియేటర్లకు తీసుకొస్తున్న మాట వాస్తవం. ముఖ్యంగా ఆంధ్ర బెల్ట్ లో పెద్ది వసూళ్లు భారీగా ఉన్నాయి. టికెట్ రేట్ల పెంపు ప్రభావం నైజామ్ లో కనిపిస్తోంది. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఒక సింగల్ స్క్రీన్ ఒక టికెట్ 420 రూపాయల ధర పెట్టడాన్ని అభిమానులే సమర్ధించలేకపోతున్నారు.దీని సంగతలా ఉంచితే పెద్ది పరుగు ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం నెమ్మదిగా ఉంది. భోపాల్ లో అంత పెద్ద ఈవెంట్, ముంబై ఢిల్లీలో ప్రెస్ మీట్లు గట్రా పెట్టి, ప్రమోషన్స్ పరంగా ప్రచారంలో టీమ్ ఎలాంటి లోపం లేకుండా చూసుకుంది. అయితే బాలీవుడ్ జనాలు పుష్ప 2, కెజిఎఫ్ 2 లాగా మొదటిరోజే చూసేయాలన్న స్థాయిలో ఎగబడలేదు. కారణం జానర్. పెద్ది దేనికీ సీక్వెల్ కాదు. కెజిఎఫ్ లాగా ఎలివేషన్లు, కాంతర లాగ డివోషన్లు లేవు. ఒక నిజాయితీ ఆటగాడి కథను చెప్పారు.దాని వల్ల టాక్ కోసం ఎదురు చూసిన హిందీ ఆడియన్స్ మెల్లగా థియేటర్లకు టర్న్ అవుతున్నారు. ఇప్పటిదాకా అయిదు కోట్ల నెట్ వసూళ్లు దాటినట్టు ట్రేడ్ టాక్. పోటీలో ఉన్న వరుణ్ ధావన్ ‘హై జవానీతో ఇష్క్ హోనాహై’కు డిజాస్టర్ టాక్ రావడం, బాబి డియోల్ ‘బందర్’ అన్ని వర్గాలను మెప్పించేలా లేకపోవడం పెద్దికి వరంగా మారొచ్చు. మరీ రికార్డులు షేక్ అయ్యే స్థాయిలో కాదు కానీ ఆక్యుపెన్సీలు డీసెంట్ గా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం.

ఉత్తరాదిలో నెమ్మదిగా మొదలైన ‘పెద్ది’ పరుగు.. లాంగ్ రన్‌పై ఆశలు..? Read More »

భగ భగ మండుతున్న భానుడు,బెంబేలెత్తుతున్న ప్రజలు

తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి ఎండ తీవ్రత అధికమవుతుంది.గడిచిన గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ,ఈ ఏడు ఎండ తీవ్రత అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఉదయం ఏడు గంటల నుండే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం పది గంటల తర్వాత బయటకు రావడానికి జనం జంకుతున్నారు.ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప బయట తిరగడం మంచిది కాదు అని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పని మీద బయటకు వచ్చే ప్రజలు తమవెంట త్రాగునీటి ని తప్పనిసరిగా తెచ్చుకోవాలి.ఎక్కువసేపు ఎండలో తిరగరాదు. అలసటగా అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.గ్రామాలలో రోజు వారి కూలి పనులకు వెళ్ళే ప్రజలు ఎండ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.చల్లటి నీరు,మజ్జిగ,లస్సీ లాంటి పానీయాలు తాగాలి.పుచ్చకాయ,తర్బుజా లాంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్ల ను విధిగా తినాలి.ఈ వేసవి కాలం లో ఎండ వేడి నుండి శరీరాన్ని రక్షించే క్రమం లో మసాలా,కారం అధికంగా వాడే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భగ భగ మండుతున్న భానుడు,బెంబేలెత్తుతున్న ప్రజలు Read More »

1363832 untitled 1

భక్తులు పోటెత్తడంతో భద్రాచలం ఆలయం భక్తిగీతాలతో మార్మోగిపోతోంది.

ఈ వారం పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో, శ్రీరామునికి ప్రార్థనలు సమర్పించేందుకు భక్తులు పూజ్యమైన భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయానికి తరలిరావడంతో యాత్రికుల తాకిడి నిరంతరాయంగా కొనసాగింది. ఆలయం భక్తి గీతాలు, వేద మంత్రాలతో మారుమోగుతూ, ప్రగాఢమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి కుటుంబాలు తరలివచ్చాయి. వారిలో చాలామంది శాంతి, శ్రేయస్సు కోసం ప్రత్యేక సేవలు చేస్తూ, అర్చన కార్యక్రమాలలో పాల్గొన్నారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయ అధికారులు దర్శన సమయాన్ని పొడిగించారు. శ్రీరాముడు ప్రతీకగా నిలిచిన భక్తి, ధర్మం, కరుణ వంటి విలువల ప్రాముఖ్యతను పురోహితులు నొక్కి చెప్పారు. భద్రాచల సందర్శన మానసిక బలాన్ని, నూతన విశ్వాసాన్ని అందిస్తుందని భక్తులు తెలిపారు. అన్నదాన సేవలు, స్వచ్ఛంద సేవా బృందాలు ఏర్పాట్లను సజావుగా జరిగేలా చూశాయి. ఇది యాత్రికులలోని సేవా స్ఫూర్తిని, ఐక్యతను ప్రతిబింబించింది.

భక్తులు పోటెత్తడంతో భద్రాచలం ఆలయం భక్తిగీతాలతో మార్మోగిపోతోంది. Read More »

rajanna

వేములవాడ రాజన్న ఆలయం శ్రేయస్సు కోసం దీవెనలు కోరుతూ భక్తులను ఆకర్షిస్తోంది

ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ క్షేమం కోసం ప్రార్థనలు చేస్తూ, ఈ వారం వేలాది మంది భక్తులు వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించారు. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం, తెలంగాణలోని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా నిలుస్తోంది. భక్తులు ఉపవాసాలు పాటిస్తూ, సాంప్రదాయ ప్రదక్షిణలు చేస్తూ, తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య జీవితంలో భక్తి, వినయం, కృతజ్ఞత యొక్క ప్రాముఖ్యతను ఆలయ పురోహితులు నొక్కి చెప్పారు. యాత్రికులు రాజన్న స్వామితో ముడిపడి ఉన్న విశ్వాస కథలను, వ్యక్తిగత అద్భుతాలను పంచుకుంటూ, ఆలయం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత బలపరిచారు. అన్ని వర్గాల ప్రజలకు స్వాగతం పలుకుతూ, రోజంతా అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. యాత్ర సమయంలో భక్తులు క్యూ పద్ధతులను పాటించాలని, ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు కోరారు.

వేములవాడ రాజన్న ఆలయం శ్రేయస్సు కోసం దీవెనలు కోరుతూ భక్తులను ఆకర్షిస్తోంది Read More »

Scroll to Top