
వరుస ప్లాపులతో సతమతమవుతూ కొత్తగా కామెడీ కొరియన్ డ్రామా తో మన ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ లో తెలుసుకుందాం…
కొరియన్ కనకరాజు పేరు వినడానికి కొత్తగా ఉన్న సినిమాలో మ్యాటర్ కూడా అంతే కొత్తగా ఉంది . అనంతపురంలో పెనుకొండలో నివసించే సామాన్య కనకరాజు కొరియన్ కనకరాజుగా ఎందుకు పిలవబడ్డాడు అసలు అతను కొరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఈ సినిమా మూల కథ.
ఈ సినిమా కథ కొరియాలో మొదలవుతుంది. అక్కడ నుంచి కథ బెంగళూరులో టేకాఫ్ అయ్యి పెనుకొండ లో ఉన్న కియా మోటార్స్ ఫ్యాక్టరీ కి చేరుతుంది
పెనుగొండలో నివసించే కనకరాజు తన ఫ్రెండు ఫోటో స్టూడియో కి వచ్చిన హీరోయిన్ తో ప్రేమలో పడతాడు . తనకేమో కొరియా వెళ్లి కొరియా వాడిని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడుతుంది అలాంటి కనకరాజు తనని ఎలా బుట్టలో వేశాడు అసలు కొరియా ఎలా వెళ్లాడు కొరియాకి కనకరాజుకి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే కొరియన్ కనకరాజు సినిమా చూడాల్సిందే.
ఇక నటీనటుల విషయానికి వస్తే కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్ అదరగొట్టాడు తనకు జోడిగా రితిక నాయక్ చాలా బాగా నటించింది. వీళ్లిద్దరు జోడి కూడా బాగుంది కనకరాజు ఫ్రెండ్ గా సత్య తనదైన శైలిలో కామెడీని పండించాడు. సత్య చేసే కామెడీకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి ఇంకా వీరికి తోడుగా కొరియా నటులు, వీటివి గణేష్, బుల్లి రాజు తమ పరిధి మేరకు నటించారు
సాంకేతిక పరంగా చూసుకుంటే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి కథాను సారం సౌత్ కొరియాలో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు ఇక సంగీతం విషయానికి వస్తే తమన్ థియేటర్స్ దద్దరిల్లేలా చేశాడు, తమన్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది.పాటలు కూడా చక్కగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది.
ఇక నిర్మాణ విలువల గురించి మాట్లాడుకుంటే యూవి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ విలువలు చాలా బాగా కుదిరాయి. చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్ కి ఒక మంచి హిట్ సినిమా దొరికినట్టే అని భావించవచ్చు. థియేటర్స్ ఆద్యంతం నవ్వుల జడిలో తడిచాయి.
ఇక చివరిగా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాకి కెప్టెన్ మరియు రైటర్ మేర్లపాక గాంధీ తనదైన శైలిలో అద్భుతమైన కామెడీని రాబట్టుకోవటంలో సక్సెస్ కాగలిగాడు. గాంధీ మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్, తరువాత వచ్చిన రన్ రాజా రన్ ఎలాంటి అద్భుతమైన నవ్వుల పండించాయో ఈ సినిమా కూడా అదే కోవలో ఆధ్యంతం నవ్వులు పండిస్తుంది.
చివరి మాట
ఈ వారాంతం ఫ్యామిలీ మొత్తం తో కలిసి థియేటర్ కి వెళ్లి మీరు మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమాని, సరదాగా హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటే కొరియన్ కనకరాజుని తప్పకుండా చూడొచ్చు.

