Postbox News

2026-10-06
Offcanvas

Posts Express

Edit Template

సినిమాలు

“థియేటర్‌లో బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో మిక్స్‌డ్ టాక్! ‘ఇరుముడి’కి ఎందుకీ తేడా?”

ఇరుముడి ఓటీటీలో మిక్స్‌డ్ టాక్‌కు అసలు కారణం ఇదే!‘ఇరుముడి’ నిన్న ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ముందస్తు అగ్రిమెంట్ కారణంగా కేవలం 28 రోజుల విండోతోనే డిజిటల్ రిలీజ్ చేశారు. ఇక ఈ శుక్రవారం నాని ‘ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో.. బాక్సాఫీస్ దగ్గర రవితేజ దూకుడుకు నాని బ్రేక్ వేయడానికి సిద్ధమైనట్టే కనిపిస్తోంది.అయితే ‘ఇరుముడి’ని స్మార్ట్ టీవీలు, మొబైల్స్‌లో చూసిన ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో కాస్త భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో చూసినప్పుడు ఒకలా.. ఓటీటీలో చూసినప్పుడు మరోలా అనిపించడానికి కారణమేంటి? అసలు ఈ మిక్స్‌డ్ రియాక్షన్ ఎందుకు వస్తోంది?థియేటర్ అనుభూతిని ఓటీటీ ఇవ్వగలదా?ఎప్పటికైనా థియేటర్‌లో సినిమా చూడటం ఇచ్చే అనుభూతికి టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ పూర్తిగా సాటి రాలేవు. ‘ఇరుముడి’ విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.ఉదాహరణకు ‘ముత్యాల పల్లకి’ పాట వచ్చినప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు మొత్తం వైబ్ అయిపోయారు. స్క్రీన్ ముందు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసిన ఆ ఎనర్జీని.. అదే పాటను ఇంట్లో ఒంటరిగా చూస్తే పూర్తిగా ఫీల్ అవ్వడం కష్టం. డాల్బీ సౌండ్, పెద్ద స్క్రీన్, చుట్టూ వందలాది మంది ప్రేక్షకుల రెస్పాన్స్.. ఇవన్నీ కలిసి సన్నివేశాల ఇంపాక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయి.ఆటో చేజింగ్ సన్నివేశాలు, అసలు హంతకుడు ఎవరనే రివీల్, క్లైమాక్స్‌లో మెయిన్ విలన్లను రవితేజ శిక్షించే ఎపిసోడ్.. ఇవన్నీ థియేటర్‌లో చూసినప్పుడు కలిగే ఎఫెక్ట్ వేరు. ఇంట్లో చూసేటప్పుడు మాత్రం ప్రేక్షకుడి దృష్టి కథ, లాజిక్, స్క్రీన్‌ప్లేపై ఎక్కువగా వెళ్తుంది.లోపాలు లేవా అంటే.. ఉన్నాయి!‘ఇరుముడి’ ఏ ‘మాయాబజార్’, ‘షోలే’ లాంటి పరిపూర్ణ క్లాసిక్ కాదు. దర్శకుడు శివ నిర్వాణ చేసిన కొన్ని పొరపాట్లు, లాజిక్‌కు దూరంగా అనిపించే అంశాలు సినిమాలో ఉన్నాయి. కొన్ని చోట్ల కథను మరింత బలంగా రాసుకునే అవకాశం కూడా ఉంది.కానీ థియేటర్‌లో తెరపై జరిగే మేజిక్, రవితేజ పెర్ఫార్మెన్స్, ఎలివేషన్స్, పాటలు, యాక్షన్ సీన్లు, క్లైమాక్స్.. ఇవన్నీ కలిసి ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయి. దీంతో సినిమా చూస్తున్న సమయంలో చాలామంది ఈ లోపాలను పెద్దగా పట్టించుకోలేదు.అసలు గేమ్ మార్చింది మౌత్ టాక్!‘ఇరుముడి’ విషయంలో మరో కీలక అంశం మౌత్ టాక్. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు సినిమాను పాజిటివ్‌గా మాట్లాడటం మొదలుపెట్టడంతో ఆ టాక్ క్రమంగా సినిమాకు బలంగా మారింది.ఒకరు సినిమా గురించి చెప్పడం.. ఇంకొకరు థియేటర్‌లో చూసి అదే అనుభూతిని పొందడం.. ఇలా మౌత్ టాక్ పెరగడంతో ‘ఇరుముడి’ రీచ్ మరింత విస్తరించింది.ఇదేమీ కొత్త పరిణామం కాదు!థియేటర్లలో సూపర్‌హిట్ లేదా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమాలకు ఓటీటీలో మిక్స్‌డ్ రియాక్షన్స్ రావడం కొత్తేమీ కాదు. ‘ఉప్పెన’, ‘మిరాయి’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలు కూడా థియేటర్లలో భారీ స్పందన అందుకున్న తర్వాత డిజిటల్‌లో భిన్నమైన చర్చను ఎదుర్కొన్నాయి.దానికి ప్రధాన కారణం.. థియేటర్‌లో సినిమా చూసే అనుభవం, ఇంట్లో సినిమా చూసే అనుభవం ఒకటి కాకపోవడమే.థియేటర్‌లో ఎలివేషన్స్, ఆడియన్స్ రెస్పాన్స్, సౌండ్, బిగ్ స్క్రీన్, సామూహిక అనుభూతి.. ఇవన్నీ సినిమాకు అదనపు ఇంపాక్ట్ ఇస్తాయి. ఓటీటీలో మాత్రం ప్రేక్షకుడికి కథ, లాజిక్, స్క్రీన్‌ప్లే వంటి అంశాలను నిశితంగా పరిశీలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.‘ఇరుముడి’కి ఇప్పుడు కొత్త సర్టిఫికెట్ అవసరమా?ఇప్పుడు ఓటీటీలో ‘ఇరుముడి’ని చూసి “బాగుంది”, “బాలేదు” అంటూ కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల సినిమాకు పెద్దగా వచ్చే లాభనష్టాలేమీ లేవు.ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో తన ప్రభావాన్ని చూపించింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి, రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.అందుకే ఓటీటీలో వస్తున్న మిక్స్‌డ్ రియాక్షన్స్‌ను సినిమాకు వచ్చిన తుది తీర్పుగా చూడాల్సిన అవసరం లేదు.థియేటర్‌లో ‘ఇరుముడి’ ఒక అనుభూతి.. ఓటీటీలో ‘ఇరుముడి’ ఒక విశ్లేషణ.ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న భిన్నమైన అభిప్రాయాలకు అసలు కారణం!

“థియేటర్‌లో బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో మిక్స్‌డ్ టాక్! ‘ఇరుముడి’కి ఎందుకీ తేడా?” Read More »

‘ఇరుముడి’ మూవీ సమీక్ష : రవితేజకు మంచి కంబ్యాక్.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకున్న మాస్ మహారాజ్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. డివోషనల్ టచ్‌తో పాటు తండ్రి–కూతురు అనుబంధం, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను మిళితం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం. కథ విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతానికి సమీపంలోని పొల్లూరు గ్రామంలో త్రినాథ్ రామ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియ భవానీ శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)తో కలిసి జీవిస్తుంటాడు. కూతురంటే త్రినాథ్‌కు ఎంతో ప్రేమ. తన చుట్టూ కనిపించే ప్రతి ఆడపిల్లలోనూ తన కూతురిని చూసుకునే వ్యక్తిత్వం అతడిది. మరోవైపు మద్యానికి అలవాటు పడిన త్రినాథ్.. కార్తీక మాసంలో మాత్రం అయ్యప్ప మాల ధరించి 41 రోజుల పాటు కఠినమైన నియమాలను పాటిస్తుంటాడు. ఈ నేపథ్యంలో గ్రామంలోని అమ్మాయిలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఓ ఘటన కథలో కీలకంగా మారతాయి. విద్యార్థులతో కఠినంగా వ్యవహరించిన ఓ టీచర్ కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోవడం, అనంతరం ఆ టీచర్ సస్పెన్షన్‌కు గురికావడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. అయితే ఆమె తిరిగి విధుల్లోకి రావడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారతాయి. అసలు త్రినాథ్ జీవితంలోకి వచ్చిన సమస్య ఏమిటి? అతడు అయ్యప్ప మాల ఎందుకు ధరించాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెరపై చూడాలి. ఎలా ఉందంటే.. శివ నిర్వాణ ఎంచుకున్న కథాంశం ఆసక్తికరంగా ఉంది. ఫస్టాఫ్‌లో కథను ఎక్కువగా సాగదీయకుండా త్రినాథ్ జీవితాన్ని, అతని కూతురితో ఉన్న అనుబంధాన్ని దర్శకుడు బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్వెల్ సమయంలో భారీ ట్విస్ట్ లేకపోయినా.. మంచి ఎమోషనల్ సీన్‌తో సినిమాపై ఆసక్తిని కొనసాగించారు. అసలు కథలోని కీలక మలుపులను దర్శకుడు సెకండాఫ్‌లో ఉంచారు. అక్కడ వచ్చే ట్విస్టులు, ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే మలుపు బాగా వర్కవుట్ అయ్యాయి. అయితే ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కొన్ని సందర్భాల్లో కథ కాస్త నెమ్మదించిన అనుభూతి కలుగుతుంది. క్లైమాక్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ.. అక్కడ వచ్చే పాటను మరింత ఎమోషనల్‌గా డిజైన్ చేసి ఉంటే ప్రభావం ఇంకాస్త పెరిగేది. రవితేజ నటన హైలైట్ ‘ఇరుముడి’ సినిమాకు ప్రధాన బలం రవితేజ నటన. తన రెగ్యులర్ మాస్ హీరో ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా త్రినాథ్ రామ అనే సాధారణ తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కూతురిపై ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాల్లో రవితేజ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఇటీవల రవితేజ నటనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌కు ‘ఇరుముడి’ మంచి సమాధానంగా నిలిచే అవకాశం ఉంది. బేబీ నక్షత్ర ప్రత్యేక ఆకర్షణ ప్రియ భవానీ శంకర్ కావేరి పాత్రలో మెప్పించారు. అయితే మణికంఠ పాత్రలో నటించిన బేబీ నక్షత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా సహజంగా నటించిన ఆమె పలు కీలక సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. సాయికుమార్ పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉంది. అజయ్ ఘోష్, స్వాసిక, లక్ష్మణ్ మీసాల, రమేష్ ఇందిర తమ పాత్రలకు న్యాయం చేశారు. రాజ్‌కుమార్ కసిరెడ్డికి మాత్రం పెద్దగా స్కోప్ దక్కలేదు. సాంకేతిక విభాగాలు ఎలా ఉన్నాయంటే.. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు మంచి ప్లస్‌గా నిలిచింది. ముఖ్యంగా అయ్యప్ప స్వామికి సంబంధించిన పాటలు కథలోని భావోద్వేగాన్ని మరింతగా క్యారీ చేశాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. అటవీ ప్రాంతాలను అందంగా, సహజంగా చూపించారు. దర్శకుడు శివ నిర్వాణ కథలోని ఎమోషన్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. చివరగా.. అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు, తండ్రి–కూతురు అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో ‘ఇరుముడి’ ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది. రవితేజ నటన, బేబీ నక్షత్ర పెర్ఫార్మెన్స్, జీవీ ప్రకాశ్ సంగీతం, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలాలు. అయితే రెగ్యులర్ మాస్ కామెడీ, గ్లామర్, రొమాన్స్‌ను ఆశించే రవితేజ అభిమానులకు ఈ సినిమా కొంత భిన్నంగా అనిపించవచ్చు. ఎమోషనల్ కంటెంట్, ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ‘ఇరుముడి’ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌గా.. ‘ఇరుముడి’ రవితేజకు మంచి కంబ్యాక్ మూవీగా నిలిచేలా ఉంది.

‘ఇరుముడి’ మూవీ సమీక్ష : రవితేజకు మంచి కంబ్యాక్.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకున్న మాస్ మహారాజ్ Read More »

కొరియన్ కనకరాజు సినిమా సమీక్ష

వరుస ప్లాపులతో సతమతమవుతూ కొత్తగా కామెడీ కొరియన్ డ్రామా తో మన ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ లో తెలుసుకుందాం… కొరియన్ కనకరాజు పేరు వినడానికి కొత్తగా ఉన్న సినిమాలో మ్యాటర్ కూడా అంతే కొత్తగా ఉంది . అనంతపురంలో పెనుకొండలో నివసించే సామాన్య కనకరాజు కొరియన్ కనకరాజుగా ఎందుకు పిలవబడ్డాడు అసలు అతను కొరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఈ సినిమా మూల కథ. ఈ సినిమా కథ కొరియాలో మొదలవుతుంది. అక్కడ నుంచి కథ బెంగళూరులో టేకాఫ్ అయ్యి పెనుకొండ లో ఉన్న కియా మోటార్స్ ఫ్యాక్టరీ కి చేరుతుంది పెనుగొండలో నివసించే కనకరాజు తన ఫ్రెండు ఫోటో స్టూడియో కి వచ్చిన హీరోయిన్ తో ప్రేమలో పడతాడు . తనకేమో కొరియా వెళ్లి కొరియా వాడిని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడుతుంది అలాంటి కనకరాజు తనని ఎలా బుట్టలో వేశాడు అసలు కొరియా ఎలా వెళ్లాడు కొరియాకి కనకరాజుకి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే కొరియన్ కనకరాజు సినిమా చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్ అదరగొట్టాడు తనకు జోడిగా రితిక నాయక్ చాలా బాగా నటించింది. వీళ్లిద్దరు జోడి కూడా బాగుంది కనకరాజు ఫ్రెండ్ గా సత్య తనదైన శైలిలో కామెడీని పండించాడు. సత్య చేసే కామెడీకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి ఇంకా వీరికి తోడుగా కొరియా నటులు, వీటివి గణేష్, బుల్లి రాజు తమ పరిధి మేరకు నటించారు సాంకేతిక పరంగా చూసుకుంటే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి కథాను సారం సౌత్ కొరియాలో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు ఇక సంగీతం విషయానికి వస్తే తమన్ థియేటర్స్ దద్దరిల్లేలా చేశాడు, తమన్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది.పాటలు కూడా చక్కగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది. ఇక నిర్మాణ విలువల గురించి మాట్లాడుకుంటే యూవి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ విలువలు చాలా బాగా కుదిరాయి. చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్ కి ఒక మంచి హిట్ సినిమా దొరికినట్టే అని భావించవచ్చు. థియేటర్స్ ఆద్యంతం నవ్వుల జడిలో తడిచాయి. ఇక చివరిగా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాకి కెప్టెన్ మరియు రైటర్ మేర్లపాక గాంధీ తనదైన శైలిలో అద్భుతమైన కామెడీని రాబట్టుకోవటంలో సక్సెస్ కాగలిగాడు. గాంధీ మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్, తరువాత వచ్చిన రన్ రాజా రన్ ఎలాంటి అద్భుతమైన నవ్వుల పండించాయో ఈ సినిమా కూడా అదే కోవలో ఆధ్యంతం నవ్వులు పండిస్తుంది. చివరి మాటఈ వారాంతం ఫ్యామిలీ మొత్తం తో కలిసి థియేటర్ కి వెళ్లి మీరు మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమాని, సరదాగా హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటే కొరియన్ కనకరాజుని తప్పకుండా చూడొచ్చు.

కొరియన్ కనకరాజు సినిమా సమీక్ష Read More »

hq720

సినిమా టీజర్లు, ట్రైలర్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన సినిమా టీజర్లు, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అభిమానులు వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటూ, చర్చిస్తున్నారు. టీజర్లు సినిమా కథ, యాక్షన్ సన్నివేశాలు, నటన గురించి ఒక సంగ్రహావలోకనం అందిస్తాయి. ఒక మంచి టీజర్ విడుదలకు ముందు అంచనాలను పెంచి, ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. సినిమా ప్రేమికులు ఇప్పుడు అధికారిక విడుదల తేదీలు, అడ్వాన్స్ బుకింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.

సినిమా టీజర్లు, ట్రైలర్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. Read More »

baahubali

భారతీయ సినిమా రంగంలో పాన్-ఇండియా సినిమాలు కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి

భారతీయ సినిమా రంగంలో పాన్-ఇండియా సినిమాలు ఒక ప్రధాన ధోరణిగా మారాయి. ఈ చిత్రాలు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో విడుదలవుతున్నాయి. ఈ ధోరణి చిత్రనిర్మాతలకు విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి, బాక్సాఫీస్ వసూళ్లను పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఎన్నో తెలుగు చిత్రాలు దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరింత మంది చిత్రనిర్మాతలు అధిక నిర్మాణ విలువలతో పాన్-ఇండియా ప్రాజెక్టులను రూపొందించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

భారతీయ సినిమా రంగంలో పాన్-ఇండియా సినిమాలు కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి Read More »

1committee kurrollu d

షెడ్యూల్ విజయవంతంగా పూర్తయ్యాక సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక తెలుగు చిత్ర షూటింగ్ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. చిత్ర బృందం మరియు నటీనటులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రానికి ఒక ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తదుపరి షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే వివిధ ప్రదేశాలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ మరియు టీజర్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

షెడ్యూల్ విజయవంతంగా పూర్తయ్యాక సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. Read More »

598ca679dbdc16328aa43ec5630250e2

ఈ ఏడాది విడుదల కానున్న భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు

ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ పలు భారీ బడ్జెట్ చిత్రాల విడుదలకు సిద్ధమవుతోంది. అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు యాక్షన్ ఎంటర్‌టైనర్లు, చారిత్రక నాటకాలు, పాన్-ఇండియా చిత్రాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ చిత్రాలలో ప్రముఖ తారలు, అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన కథనం ఉంటాయి. అభిమానులు అధికారిక విడుదల తేదీలు, టీజర్ల ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి, భారతదేశంతో పాటు విదేశాలలోని ప్రేక్షకులను ఆకర్షిస్తాయని పరిశ్రమ నిపుణులు ఆశిస్తున్నారు.

ఈ ఏడాది విడుదల కానున్న భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు Read More »

Scroll to Top